Ganesh Maharaj Birth History in Telugu

వినాయక జననం..

హీమాలయ పర్వతాలలో కైలాసశిఖరం పార్వతీ పరమేశ్వరుల నివాసం. ఒకసారి పార్వతీదేవి మట్టితో చక్కని  కుర్రవాణ్ణి సృష్టించి ,అతన్ని ద్వారం వద్ద కావలి ఉంచి.తాను స్నానానికి వెళ్లింది.అంతలో శివుడుఅక్కడికి  వచ్చి లోపలికి వెళ్లబోగా కుర్రవాడుఅడ్డగించాడు.నేను శివుణ్ణి పార్వతీ దేవికి భర్తను ,అంటూ అతడు బలవంతంగా లోపలికి వెళ్లబోయాడు.నువ్వు ఎవడివైతే నాకేమి ? ఎవరినీ రానీయవద్దని  నాతల్లీ ఆజ్ఞ! అంటూ ఆకుర్రవాడుతన చేతనున్న దండంతో శివుణ్ణి కొట్టాడు.శివుణ్ణి కోపం వచ్చి వీణ్ణీ  అవతలికి నెట్టి నేయండి.అని తన వెంట ఉన్న ప్రమథులను ఆజ్ఞాపించాడువాళ్లు ఆపని చేయలేకపోయారు.కుర్రవాడు తన ముష్టి ఘాతాలతో వారిపైన విరుచుకు పడ్డాడు.

అతని ప్రతాపానికి తాళలేక శివానుచరులైన భూత ప్రేత పిశాచ గణాలన్నీ పారిపోయాయి.అది చూసి శివుడురౌద్రావేశంతో త్పరిశూలంతో బాలుడి తలను చేదించాడు.

అప్పుడు పార్వతీదేవికి అంతులేని దుఃఖం కలిగింది.పట్టరాని కోపంతో ఆమె వెయ్యి మహాకాళి కలను సృష్టించి జగత్తునంతా నాశనంచెయ్యమని ఆజ్ఞపించింది.వెంటనే బ్రహ్మ,విష్టువు,ఇంద్రుడూ మొదలైనా దేవతలంతా పరుగు పరుగున పార్వతీ వద్దకు వచ్చి కాపాడవలసిందని కోరారు.దానికి ఆమె నాకొడుకు మళ్లీ బతికి మీఅందరి చేతా పూజింపండాలి.అప్పుడుగానీ నేను శాంతించును అంది.శివుడుఅందుకు సమ్మతించి పిల్లవాడి తలను మొండేనికి అతికించాలని ఎంతో ప్రయత్నించాడు.కానీ అవిఒకదాని కొకటి అంటుకోలేదు అప్పుడు శివుని ఆజ్ఞమేరకు నందీశ్వరుడు ఉత్తర దిక్కుగా వెళ్లి ఒక ఏనుగు తలను నరికి తేచ్చాడు.శివుడు ఆ శిరస్సును బాలుని మొండేనికి అతికి అతన్ని బతికించాడు.పార్వతీ సంతుష్టురాలై తను సంహర శక్తులన్నింటినీ ఉపసంహరించింది.

బ్రహ్మదేవుడు ఆబాలుడికి వినాయకుడని నామకరణం చేశాడు.ముల్లోకాలంలోని వారూముద్దగా అతన్ని పూజించేలా వరమీచ్చాడు.వినాయకుడికి సరస్వతీ దేవి ,సకల విద్యలనూ ప్రసాదించీ ఒక గంటాన్ని ఇచ్చింది విష్టువుఒక  అమృత కలశాన్నీ భూదేవి మూషికవాహనాన్నీ ఇచ్చారు.ఇంద్రడు అంకుశాన్నీ లక్ష్మీదేవి  ఆష్టైశ్వర్యాలనూ పార్వతీ దేవి..చీరాయువునూ ప్రసారించారు.శివుడు వినాయకుణ్ణి తన ప్రమథగణాలకు అథిపతిగా పట్టాభిషిక్తుణ్ణీ చెయ్యగా దేవతలందరూ జయగణపతీ  అంటూ నినాదాలు చేసి నృత్యగీతాలతో అతన్ని పూజించారు.

Leave a comment